ఇప్పుడు వెండి, బంగారు జుంకీలేనా. ఎన్నో రంగుల ఎంతో అందమైన దుస్తుల పైకి ఏ మాత్రం మ్యాచవ్వ కుండా ఈ ఓల్డ్ ఫ్యాషన్ గోల్డ్ నగలేనా అని విసుక్కునే అమ్మాయిలు ఫర్ స్టడ్స్ చుస్తే వావ్ అంటారు. ఉన్ని తో చేసిన అందమైన పామ్  పాం చెవి పోగులు కాలేజీ కి , పార్టీలకు అన్నింటికి కొత్త ఆకర్షణే . కాస్త పెద్దవిగా వుండే స్టడ్స్ ఎంచుకుంటే ఇంకా వేరే గోలుసు కుడా అక్కర్లేదు. ఎన్ని అందమైన వర్ణాలున్నాయో అన్ని వర్ణాలలో  ఈ ఉన్ని లోలాకులు అందం ఒలక బోస్తున్నాయి. వీటిల్లో బేబీ పింక్ , నీలం రంగులు ఎంచుకుంటే ఇవి అన్ని రంగుల దుస్తుల పైకి చక్కగా అమరి పోతాయి. ముఖ్యంగా లేత రంగులు సాదా దుస్తుల పైకి ఈ ఫర్ తో చేసిన స్టడ్స్ గొప్ప అందం ఇచ్చేస్తాయి. ముఖానికి చక్కని అందం తెచ్చిపెడతాయి.

Leave a comment