Categories
రాగి,ఇత్తడి పాత్రలు వాడండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. రాగి పాత్రల్లో మూడు గంటల పాటు నీటిని నిల్వ చేస్తే ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయట. దీనితో ఆ నీరు పరిశుభ్రంగా మారుతోంది. అలాగే ఇత్తడి బిందెలు జింక్ ,రాగి మిశ్రమంతో తయారు అవుతాయి.జింక్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోంది. ఇత్తడి పాత్రల్లో నీరూ ఆరోగ్యం,అలాగే వంటచేకొన్న ఆరోగ్యమే .రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగటం వల్ల అసిడిటీ,అజీర్ణం ,డయేరియా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.అధిక బరవు సమస్య తగ్గుతోంది. థైరాయిడ్ గ్రంథి పని తీరు పెరుగుతోంది. ప్రాచీన కాలంలో లాగా ఇప్పటికైనా రాగి ఇత్తడి పాత్రలు వాడుకోవటం మొదలు పెడితే ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు అధ్యయానకారులు.