హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మై ఛాయిసెస్ ఫౌండేషన్ (my choices foundation)మూడేళ్లుగా మహిళలు, బాలికల అక్రమ రవాణాని బలంగా అడ్డుకుంటుంది.ఇందుకోసం జాతీయ స్థాయిలో ఆపరేషన్ రెడ్ అలర్ట్ పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకూ వివిధ హింసల నుంచి బయటపడ్డ సుమారు వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది మా సంస్థ.ఇలాంటి సమస్యలను నిర్వహించటం అంత సులువేం కాదు.మా సంస్థ పైన మా కార్యక్రమములు నిలిపివేయమని చాలామంది దాడులకు దిగుతూ ఉంటారు అంటున్నారు సంస్థ వ్యవస్థాపకురాలు ఎల్కా గాబ్రెల్. ఆర్ధిక శాస్త్రం చదువుకున్న ఎల్కా జర్మనీ దేశస్థురాలు.ఈ సంస్థలో 80 మందికిపైగా కార్యకర్తలు పని చేస్తున్నారు.ఇంతవరకూ తొమ్మిది వేల గృహహింస కేసులు పరిష్కరించారు అంటున్నారు ఎల్కా.

Leave a comment