Categories
కపుర్తలా రాజవంశానికి చెందిన రాకుమారి అమృత్ కౌర్ లండన్ వెళ్లి ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత దేశ స్వతంత్రం కోసం పని చేయాలని అనుకున్నారు. గాంధీజీ కి సెక్రెటరీ గా 17 సంవత్సరాల పాటు పని చేశారు. క్విట్ ఇండియా, దండి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు ప్రాణం పోశారు. సిమ్లా లోని తన రాజా భవంతిని ఎయిమ్స్ లో పనిచేసే నర్సుల కోసం ఇచ్చారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా పనిచేసిన తొలి ఆసియా మహిళా అమృత కౌరే.