ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ది రామానుజన్ ప్రైజ్ పురస్కారానికి ఎంపికైంది డాక్టర్ నీనా మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న నాలుగవ వ్యక్తి మహిళలలో మూడవ వ్యక్తి నీనా గుప్తా. 2014 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ కోల్ కతా ప్రొఫెసర్ అయిన నీనా 70 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఒక గణిత సమస్యను పరిష్కరించి ప్రశంసలు పొందారు. పిల్లల్లో ఉండే మ్యాథ్స్ ఫోబియా పోగొట్టి వాళ్లలో ధైర్యం నింపేలా ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారు డాక్టర్ నీనా గుప్తా.

Leave a comment