Categories
ఇళ్ళల్లో,ఆఫీస్ ల్లో,తరగతి గదుల్లో స్నేక్ ప్లాంట్లని పెంచండి ,గాలిలో కాలుష్య కారకాల శాతం తగ్గిపోతుంది అని చెప్పారు నాసా పరిశోధన కారులు.ఏడాది పొడువునా పచ్చగా ఉండే బ్లాక్ గోల్డ్ జాక్, రోబస్టా సిలిండ్రికా రకాల ఇళ్ళల్లో పెంచుకోవచ్చునని సిఫార్స్ చేశారు. ఒక 1800 చదరపు అడుగుల గదిలో మీడియం నుంచి కాస్త పెద్దసైజ్లో ఉండే పది ,పదిహేనూ రకాల స్నేక్ ప్లాంట్స్ పెంచితే చాలు గాలిలో రసాయనాలని పూర్తిగా వడగట్టేస్తాయట. రోజుల తరబడి నీళ్ళు పోయకపోయినా చచ్చిపోవచ్చు. ఇంట్లో పెరట్లో బాత్ రూమ్స్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆకులపై దుమ్ము ధూళి, పేరుకోకుండా చూస్తే చూసేందుకు కూడా చాలా అందంగా అసలు ఇంటికే ఇవి అందం అనేలా ఉంటాయి.