Categories
నెయిల్ పాలిష్ పైన డిజైన్లు సొంతంగా వేసుకోవడం చాలా కష్టం ఎవరైనా నైపుణ్యం ఉన్న ఆర్టిస్ట్ ల బ్రష్ లతో వేయాలి. ఇప్పుడు ఆ డిజైన్ లు అతికించుకునే స్టిక్కర్స్ లాగా వస్తున్నాయి. అవి అతికించుకొన్నవి అని తెలియకుండా సన్నని లైన్ స్టిక్కర్స్ డెకాల్స్ కూడా ఉన్నాయి. వీటిని మ్యాట్ గ్లిట్టర్ నెయిల్ స్ట్రిప్పింగ్ టేప్ లైన్స్ అంటున్నారు. ఎన్నో రంగుల్లో వస్తున్నాయి ఇవి. ఇలాటి టేపులు కొని నెయిల్ పాలిష్ వేసుకున్నాక కోరిన సైజ్ లో కత్తిరించి అతికించుకోవచ్చు. ఈ టేపులకు జిగురు అక్కరలేదు. అలా అంటిస్తే అంటుకొని ఉండిపోతాయి. ఈ టేప్ లతో ఎవరికి వాళ్లే చక్కని డిజైన్లు సృష్టించుకోవచ్చు.