Categories
మెహందీ పెట్టుకున్న చేతులు చక్కగా ఎర్రగా కనిపించాలంటే చిన్న చిట్కాలు పాటించాలి. మెహందీ డిజైన్ ఆరాక తర్వాత కడిగేసుకోకుండా ముందుగా చేతులకు ఆవ నూనె రాసుకోవాలి. లవంగాలు పాన్ మీద వేడి చేసి ఆ పొగను మెహందీ పెట్టుకున్న చేతులకు చూపించాలి. అలాగే నిమ్మరసం లో పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మెహందీ పెట్టుకున్న చేతులపై చిలకరించాలి. ఆరిపోతుండగా మరోసారి ఈ మిశ్రమాన్ని చిలకరించి ఆరిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఈ చిట్కాలు బాగా పని చేయాలంటే ముందుగా మెహేంది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నీటితో కడుక్కోకుండా పొడిగానే తీసివేయాలి. వీలైనంత సేపు చేతులకు నీళ్ల తగల నివ్వకూడదు అప్పుడు చేతుల గోరింటాకు ఎర్రగా పండుతుంది.