పిట్ నెస్ నా జీవన శైలిలో ప్రధానమైన అంశం కాబట్టి మొదటి నుంచి నేను నా ఆహారపు అలవాట్లు వ్యాయామం విషయంలో చాలా కఠినంగా ఉంటాను అంటుంది తమన్నా . క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరచు కొంటేనే పని బాగ చేయిగలుగుతామని అనుకొంటాను . రోజుకో గంట ఖచ్చితంగా జిమ్ లో గడుపుతాను . కార్డియో,యోగా పరుగు వెయిట్ ట్రయినింగ్ వంటివి తప్పనిసరిగా చేస్తాను. అలాగని నేను నోరు కట్టుకోలేను . వారంలో రెండు రోజులు నాకు ఇష్టమైనవి తినేసి ఆరోజుల్లో ఇంకాస్త ఎక్కువసేపు వ్యాయామం చేస్తాను . నా దృష్టిలో వ్యాయామం,ఆహారం పక్కాగా ఉంటేనే మానసిక స్థితి కూడా బావుంటుంది అనుకొంటాను అంటోంది తమన్నా . సినీ తారలను ఆరాధించే వాళ్ళు ఈ ఆరోగ్య రహస్యాన్ని ఫాలో అయితే బావుండు కదా ?