Categories
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరికలు చేస్తారు. దీని వెనుక మంచి రిసెర్చ్ రిపోర్ట్ వుంది. ఎక్కువ సేపు సెల్ లో మాట్లాడే వారికీ ఇతర శబ్దాలు వినిపించటం నెమ్మదిగా తగ్గుతాయి. రెండవది, మెదడు ఒకే సారి రెండు పనుల పైన ద్రుష్టి పెట్టలేకపోతుంది. అంచేత మాట్లాడటం, రోడ్డు పైన ద్రుష్టి కేంద్రీకరించడం రెండు ఒకేసారి సమర్ధవంతంగా జరగవనే కారణంతో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దంటారు. ఒక వైపు సెల్ ఫోన్ లో ద్యానుల స్ధాయి బయట వ్నబడే ద్యానుల స్ధాయి తేడా గా వుంటాయి. ఈ రెండు ఒకే సారి చెవుల్లో పడుతూ ఫలానా శబ్దం ఫలానా విషయానికి సంబందించినదనే విషయాన్ని మెదడు చాలా ఎక్కువ కష్టపడి కనిపెడుతూ వేగంతో సమానంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు అలిసిపోతుంది. అందుకే ఈ హెచ్చరిక.