మోనికా షెర్గిల్ నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషన్ ఒరిజినల్స్ హెడ్ కూడా. మేరట్ లో పుట్టి పెరిగినా మోనికా ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశారు పర్యావరణ పాత్రికేయురాలు గా జీవితం మొదలు పెట్టింది. బీహార్ లోని ధన్ బాద్ లో అక్రమ గనుల తవ్వకాలు, మధ్యప్రదేశ్ గుజరాత్ లోని పరిశ్రమల కాలుష్యం పై కథనాలు చిత్రీకరించారు గ్రీన్ ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘లివింగ్ ఆన్ ది ఎడ్జ్’ ఆమె తీశారు నెట్ ఫ్లిక్స్ లో ఆమె ఉద్యోగం ఆమెను ఫార్చ్యూన్ ఫోర్బ్స్ ఇండియాల శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. 2020 లో 3000 కోట్ల ఖర్చుతో 40 డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్ తీశారామె.

Leave a comment