Categories
రెస్టారెంట్ లో భోజనం చేసేటప్పుడు ఫుడ్ చాయిస్ లో కొన్ని చిట్కాలు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. రెస్టారెంట్ ఎంచుకునే ముందర వెబ్ సైట్ వెతికి పదార్ధాలు ప్లాన్ చేసుకోవాలి. పోషకాహరం సమాచారం చేసుకోవాలి. అరోగ్యవంతమైన ఆప్షన్లు లేకపోయినా కళ్ళకు నచ్చకపోయినా మరోక దాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రోటీన్లు తగు మాత్రంగా ఉండాలి. గ్రిల్,స్టీమ్ బాయిల్ చేసినవి బావుంటాయి. వేయించిన వాటితో పోలిస్తే వీటిలో కొవ్వు అదనపు క్యాలరీలు చాలా తక్కువ. బంగాళా దుంపలు,వైట్ రైస్ కంటే స్టీమ్ చేసిన బ్రకోలి,పాల కూర,బీన్స్ మంచివి అధికంగా కొవ్వు ఉండే పదార్ధాలు రెస్టారెంట్లలో అసలు తినకూడదు.శరీరంలో అదనపు క్యాలరీలు చేరనివ్వకుండా ఎంచుకుని తినాలి.