Categories
మొటిమల మచ్చలు పోయి చర్మం కాంతి వంతంగా మెరిసిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించమంటున్నారు నిపుణులు. శనగపిండిలో గుడ్డు తెల్లసొన గంధంపొడి కలిపి ఈ ఫ్యాక్ వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ఒక్క వారంలో మార్పు తెలుస్తుంది. ఈ ప్యాక్ రోజూ వేసుకోవచ్చు. దాల్చిన చెక్కపొడి లో నీళ్ళుకలిపి పేస్టులాగా చేసి మొటిమలు ,మచ్చలు ఉన్నా చోట రాసి కాసేపాగి కడిగేయాలి. క్రమం తప్పకుండా ఈ ఫ్యాక్ అప్లైయ్ చేస్తే ముఖం కాంతి వంతంగా ఉంటుంది. క్యారెట్ ,నారింజ, పాలు కలిపి పేస్ట్ చేసి ఈ మిశ్రమం ముఖానికి పట్టించి ఆరే వరకు ఉంచి కడిగేస్తే ముఖం పైన మచ్చలు మరకలు క్రమేపీ తగ్గిపోతాయి.