Categories
ఇంట్లో డైరెక్ట్ గా టి, కాఫీ పొడులు వాడుకోండి కానీ టీ బ్యాగులు ,కాఫీ,గ్రీన్ టీ బ్యాగులు వాడవద్దు అంటున్నారు అధ్యయనకారులు . ఒక టీ,లేదా గ్రీన్ టీ బ్యాగ్ ,11 బిలియన్,మైక్రో ప్లాస్టిక్ అంటే పదకొండు వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్,దాని తో పాటు మూడు వందల కోట్ల నానో పాస్టిక్ కణాలు విడుదల చేస్తుందని గుర్తించారు. కాఫీ,టీ బ్యాగ్ లో నైలాన్, లివిసి,ఏసిక్లోరో పై డ్రిన్ ,ధర్మో ప్లాస్టిక్ వంటి పదార్దాలతో తయారు చేస్తారు. ఈ బ్యాగ్ లో వేడి వేడి పాలు లేదా నీటిలో ముంచితే వాటి నుండి ప్రమాదకరమైన రసాయనాలు ఆ నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా ఇవి కర్సనోజెన్లు జాబిదాకు చెందుతాయని సైంటిస్ట్ లు చెపుతున్నారు. కర్సనోజెన్లు కాన్సర్ కారకాలు. కనుక ఈ టి,కాఫీ బ్యాగ్ లు వాడొద్దంటున్నారు.