ప్రతి రోజు ఒక గ్లాస్ కమలా పండు రసం తాగమని ,ఇది మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనీ, ఆలోచన శక్తి పెరుగుతోందని ఒక పరిశోధన చెపుతోంది. ఈ పండు రోజు తింటే వాటిలోని ఫ్లేవనాయిడ్ల కారణంగా కంటి కండరాలు క్షీణత తక్కువగా వస్తుందని పరిశోధనలు తేల్చాయి. కమాల పండులో విటమిన్ సి పోటాషియం సమృద్దిగా ఉండటం వల్ల అవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్ సి గాయాల్ని తగ్గిస్తుంది. కమాల పండులో ఉండే పీచుతో మలబద్దకం ,డయేరియా వంటివి దగ్గరకు రావు. ఇన్నీ పోషకాలున్న కమాల పండుని రోజుకి ఒక్కటైన తినమంటున్నారు పరిశోధకులు.

Leave a comment