మిన్న మినుంగు సినిమాలో నటించిన సురభి లక్ష్మి కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లో బెస్ట్ యాక్టర్  గా ఎంపికయింది .ఇది ప్రపంచంలో అతి సాధారణంగా కోట్ల కొద్దీ కుటుంబాల్లో జరిగిన లేదా, జరుగుతున్న కథ .భర్త మరణించాక పసిబిడ్డ నే సర్వస్వంగా భావిస్తూ పెంచుకుంటుంది ఒక తల్లి .ఆమె తండ్రి తోడుగా ఉంటాడు ఆ కూతురు పెరిగి పెద్దదై తల్లికి చెప్పకుండానే వెళ్లి ఒక మంచి భవిష్యత్ కోసం కెనడా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఆ ప్రయాణం కోసం తన కున్న, సర్వస్వం అమ్ము కొంటుంది తల్లి .పై చదువులు చదువుకొని తిరిగి వస్తుంది అనుకుంటున్న కూతురు ఇంకెప్పటికీ రాకుండా తన దారి తాను చూసుకుంటుందని తెలుస్తుంది తల్లికి .పిల్లల్ని ప్రేమించి పెంచి వాళ్ల భవిష్యత్తు కోసం బ్రతుకంతా త్యాగం చేసి చివరకు శూన్య హస్తాలతో మిగిలే ఎంతోమంది తల్లిదండ్రుల కథే ఇది నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూడండి.

Leave a comment