కాశ్మీర్ లో తొలి మహిళా ఫిట్ నెస్ ట్రైనర్ ఆలియా ఫారూక్. శ్రీనగర్ లోని ఖన్యార్ కు చెందిన ఆలియా ఇద్దరు పిల్లల తల్లి హార్మోన్ల అసమతుల్యత తో జిమ్ లో చేరిన ఆలియా తానే ఫిట్ నెస్ ట్రైనర్ కావాలనుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో చేరి ఫిట్ నెస్ లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంది. 2012 నుంచి జిమ్ ఇన్స్ట్రక్టర్ గా మారింది. ఈ 9 సంవత్సరాలలో ఆలియా 20వేల మంది అమ్మాయిలకు పైగా ఫిట్ నెస్ లో శిక్షణ ఇచ్చింది. ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి తాజాగా జాతీయ అవార్డుకు నామినేట్ అయింది.

Leave a comment