డెహ్రాడున్ ప్రాంతంలో బాగా పండే లీచెస్ పండ్లు మనకు స్నేహితుల్లాటివి. పై తొక్క గట్టిగా ఉంటుంది కాని లోపల పండు తెల్లగా మెత్తగా తియ్యని బుల్లి లాంటి ముంజలాగా ఉంటుంది. చల్లగా ఉండే ఈ వాతావరణంలో ఇంకా ఇష్టంగా తినాలి కూడా దగ్గు రానీయదు. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వివిధ గ్రంధుల పైన సానుకూల ప్రభావం వుంటుంది. వీటిలో కాల్షీయం,ఫాస్పరస్,పోటాషీయం ఎక్కువగా ఉంటాయి. రెబోఫ్లోనిక్, ఐరన్,పెక్టిన్ లు లీచెస్‌ లో లభిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ తగ్గించే కరిగే స్వభావం గల ఫైబర్ శాతం ఎక్కువ. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ పండ్లు ఈ సీజన్ లో తింటే మంచిది.

Leave a comment