Categories
మంచి గంధం,పన్నీరు,పునుగు,అత్తరు,లవెండర్ వంటి సూవాసనలు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి.ఒక్కో రకం సువాసన ఒక్కోక్క అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. స్ట్రెస్,మానసిక అంశాలు,డిప్రెషన్ వంటి వాటి నుంచి ఈ సువాసనలు రిలీఫ్ ఇస్తాయి. శారీరక మానసిక రుగ్మతలు నయం చేసే శక్తి అరోమ థెరపి నుంచి రక్షణ గెలిపిస్తుందని సమాచారం.మందులుగా ఉపయోగించే పుష్ప తైలాలున్నాయి. పంటి వ్యాధులకు లవంగ నూనె మంచి గంధం,చల్లదనం కోసం కడుపు నొప్పికి చామంతి నూనె,కొవ్వు తగ్గించే నిమ్మ నూనె స్ట్రెస్ డిప్రెషన్ తగ్గించే లెమన్ ఆయిల్ బాక్టీరియాని సంహరించే తులసి సాధరణంగా అందరికి తెలిసినవే. ఇలాంటి చిన్నపాటి అనారోగ్యాలకు మందులు జోలికి పోకుండా ఈ సువాసనల తైలాన్ని వాడుకొమ్మంటున్నారు వైద్యులు.