Categories
ఉదయపు వ్యాయామం గా ఏది బెస్ట్ పరుగా ? నడకా ? డైలమా చాలా సార్లు వస్తుంది.రెండు ఒకే లాటి లాభాల్ని కలిగిస్తాయి కానీ కరిగించే క్యాలరీల విషయంలో కాస్త తేడా ఉంది.నడక కన్నా పరుగులో క్యాలరీలు కరిగిపోతాయి. రెండు వ్యాయామాలు గుండెకు మేలు చేసేవే జీవ శక్తిని పెంచి రోగనిరోధక వ్యవస్థ పనితీరును బలపరుస్తాయి.దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. బరువు తగ్గటం విషయానికి వస్తే నడక కన్నా పరుగే మంచిది 72 కిలోల బరువు ఉన్న మనిషి గంటకు ఐదు మైళ్ల వేగంతో పరుగులు తీస్తే దాదాపు 60 కేలరీలు కరిగించుకోవచ్చు. మొదట నడకతో మొదలుపెట్టి పరుగు ప్రాక్టీస్ చేయడం మంచిదంటున్నారు ఎక్సపర్ట్స్ .