Categories
బెంగళూరు లో ఒక చాలీచాలని ఇంట్లో నివసించే తిమ్మక్క సాలుమరద తిమ్మక్క గా కర్నాటక లో పేరు పొందింది. రహదారుల వెంట చెట్లు నాటటం అనే ఉద్యమం లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది తిమ్మక్క. సంతానం లేని తిమ్మక్క చెట్లు పెంచటం లక్ష్యం లో తన స్వగ్రామం హోలీ కళ్ వచ్చే దారి వెంట 400 మర్రి చెట్లు పెంచింది. 1948 లో ప్రారంభించిన ఈ పని ఎంత పేదరికంలో ఉన్నా తినేందుకు తిండి లేకున్నా వదిలి పెట్టలేదు. కర్నాటక గవర్నమెంట్ మొక్కలు నాటే కార్యక్రమానికి తిమ్మక్క పేరు పెట్టి గౌరవించారు. ప్రజలు ఆమెను వృక్షమాత అంటారు.