Categories
పశ్చిమ బెంగాల్ లోని హిమాలయ పర్వతాల మొదట్లో ఉంటుంది. అత్యంత రమణీయమైన హిల్ స్టేషన్ కాలింపాంగ్ పట్టణం. సహజమైన అందాల చరిత్ర వినూత్నమైన సంస్కృతుల సమ్మేళనం తో కాలింపాంగ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది.పట్టణానికి ఒకవైపు కాంచన్ జంగ్ పొగ మంచుతో కప్పబడిన పర్వతాలు ఇంకో పక్క డర్పిన్ డియో లో కొండలు సహస పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి సమీపంలోని టీస్తా నది ప్రవహిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఇండియాలో ఒకనాటి హిమాలయన్ వాణిజ్య మార్గం లో ప్రముఖ పట్టణం గా ఉంది కాలింపాంగ్. ఇక్కడ హార్టికల్చర్ పరిశ్రమ ఈ పట్టణాన్ని మరింత అందంగా మార్చేసింది.