ఎన్నో రకాల మౌత్ ఫ్రెష్నర్స్ అందుబాటులో వున్నాయి కానీ ఇంట్లో చేసే చిన్న టిప్స్ ఎక్కువ ఉపయోగపడతాయి . అసలు బ్యాగ్ లో లవంగాలు యాలకులు వుంచుకుంటే అంత కంటే మౌత్ ఫ్రెష్నర్స్ ఏముంటాయి. అలాగే సోంపు కూడా. ఆహారం జీర్ణం అవ్వాలంటే భోజనం తర్వాత సోంపు తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. సోంపు జీర్ణ శక్తిని పెంచటమే కాదు . నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్తీరియా తో పోరాడి సమస్య ను దూరం చేస్తాయి. నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు సోంపు అందుబాటులో ఉంచుకుంటే చాలు. యాపిల్ లో ఎన్నో రకాల యాసిడ్స్ ఉంటాయి. బయటకు వెళ్లే ముందర ఓ యాపిల్ ముక్కలు నమిలితే చాలు. ఇందులో వుండే యాసిడ్లు యన్తీ ఆక్సిడెంట్లు హానికరమైన బాక్టీరియా ను నివారించి నోటిని తాజాగా ఉంచుతాయి. దుర్వాసన ఇందులోని పాలినాయిడ్స్ లాలాజలం లోని దుర్వాసనతో పోరాడతాయి. నోటిని తాజాగా ఉంచటం లో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పెరుగు మంచిదే. బయటకు వెళ్లే ముందర నాలుగైదు చెంచాల పెరుగు తింటే సరి.
Categories