ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే, వాటి తయారీలో వాడే థాలేట్స్ మరణానికి చేరువ చేస్తుంది అంటున్నారు న్యూ యార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్ న్యూన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు. కర్టెన్లు, షూలు, పైపులు పర్ఫ్యూమ్స్, సబ్బులు, షాంపూలు వంటి అనేక వస్తువుల ఉత్పత్తిలో వీటి వాడకం పెరిగి పోయిన కారణంగా ఒక్క అమెరికాలోనే లక్షకుపైగా ముందస్తు మరణాలు చోటు చేసుకుంటున్నాయట. ఈ ప్లాస్టిక్ హార్మోన్ల వ్యవస్థ ను దారుణంగా దెబ్బ తీస్తోంది అంటున్నారు. థాలేట్స్ శరీరంలోకి ప్రవేశించట్టం వల్ల గర్భవతుల ప్లాసెంటా లోని జన్యువుల్లో మార్పులు చేసుకుంటున్నాయని పరిశోధకులు గమనించారు. శిశువు ఎదుగుదలలో లోపాలు చోటు చేసుకొంటాయని సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించమని వారు గర్భిణులను హెచ్చరిస్తున్నారు.

Leave a comment