Categories
బత్తాయి పండు తినడం, రసం తాగడం చేస్తూనే వుంటాం కానీ ఖరీదైన ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్ ల కంటే బత్తాయి కాళ్ళకింది వలయాలు, నల్ల మచ్చలు, పెదవులు నల్లబడటం వంటి వాటికి ఉత్తమ చికిత్స ఒక సింపుల్ పరిష్కారం . ముఖం శుబ్రంగా కడిగి తుడుచుకుని బత్తాయి సగం చెక్క కోసి ఆ చెక్కతో ముఖానికి మసాజ్ చేయాలి. గుండ్రని కదలికలతో ముఖాన్ని స్క్రుబ్ చేయాలి. ఇలా పది నుంచి పన్నెండు నిమిషాలు చేసి చల్లని నీళ్ళ తో కడిగేయాలి. బత్తాయి జుఇచ్స్ తేలికపాటి బ్లీచ్ గా క్లెంసింగ్ ఏజెంట్ గా పని చెఇ ముఖం కంటి వంతంగా చేస్తుంది. బ్లాక్ హెడ్స్ పోగొడుతుంది. మెడ వెనుక, ముంజేతులు, మోకాళ్ళ పైన బత్తాయి చెక్కతో రుద్దితే చాలు. ఈ రసం, పెదవులకు తగులుతూ వుంటే నలుపు పగుళ్ళు పోతాయి.