Categories
రొజువారీ రొటీన్ లో తేలికగా వదిలేసే వ్యయామం సమయం సరిపోదనే సాకుతో ఎప్పుడూ పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే చురుగ్గా వుండే మర్ఘాలు ఎన్నో వున్నాయి. సరైన ఆహారం తీసుకోవాలి. వర్క్ ప్లేస్ కు సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళాలి. లిఫ్ట్ బదులు మెట్లు వాడాలి. డెస్క్ ముందు కుర్చుని పని చేయడం వల్ల శీఘ్రంగా బరువు పెరుగుతారు. సమయం సరిపోక పొతే రోజుకు రెండు మూడు సార్లు పడేసి నిమిషాలు కేటాయించుకుని స్ట్రెచ్చింగ్ లాంటివి చేయాలి. జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ కు దినందిన జీవితంలో కాస్త చోటు ఇవ్వాలి. రోజుకో అరగంట ఇచ్చినా చాలు. ఫిట్నెస్ విషయంలో షార్ట్ కట్లు, శీఘ్ర ఫలితాలు వుండవు. శ్రద్ధ తో దృఢమైన నిర్ణయం తీసుకుని వ్యాయామం కోసం సమయం ఇచ్చి తీరాలి.