బొప్పాయి పండే కాదు, పచ్చ బొప్పాయితో కూరలు కూడా ఎంతో బావుంటాయి. కూరగా,పచ్చడిగా, సలాడ్ గా దాన్ని హాయిగా తినవచ్చు. పచ్చ బొప్పాయి తురిమి ఎండబెట్టి అచ్చం కొబ్బరిపొడిలా ఉంటుంది కదా దాన్ని కూరల్లో కూడా వాడుకోవచ్చు. ఇందుకు పిండి పదార్ధాలు, స్టార్ట్ తో పాటు , కారైనా లిడ్స్ తో పాటు ,సోపోనిక్స్ అనే రసాయనాలు పుష్కలం. ఇందులో గాయాలను తగ్గించే ఎన్నో ఎంజైమ్స్ ఉన్నాయి. పచ్చ బొప్పాయిని ఔషధాలలో కూడా వాడతారు. పచ్చ బొప్పాయి తురిమి , క్యాబేజీ తురుమును కలిపిన సలాడ్ ఎంతో రుచిగా ఉంటుంది కూడా , వేయించిన వేరు శనగలు, దానిమ్మ గింజలు, ఉప్పు, నిమ్మరసం కాస్తా వేయించి పచ్చి బొప్పాయి,క్యాబేజి తురుముతో కలిపి సలాడ్ తింటే రుచికి రుచి ,పోషకాలు పుష్కలం కూడా.

Leave a comment