సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు సలహాదారుగా ఆరతి. దిల్లీలో పుట్టిన ఆరతి 1993లో బిల్‌క్లింటన్‌ అధ్యక్షుడిగా ఉండగా ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ’ హెడ్‌గా బాధ్యతలు తీసుకొన్నారు. తర్వాత డీఏఆర్‌పీఏ కు నాయకత్వ బాధ్యతలు వహించారు.‘క్యాన్సర్‌ మూన్‌షాట్‌’ పేరుతో క్యాన్సర్‌ పరిశోధన, చికిత్స కోసం జో బైడెన్‌ తెచ్చిన కార్యక్రమంలోనూ ఆరతి పనిచేశారు. ‘ప్రతిభావంతురాలైన ఇంజినీర్‌, భౌతికశాస్త్రవేత్త. శక్తిమంతమైన ఆవిష్కరణలలో అమెరికాను ముందుంచే వ్యక్తి అని ఆరతిని ఎంతో కొనియాడారు బైడెన్‌.

Leave a comment