ఈ మధ్య కాలంలో పెదవులు లావుగా అందంగా కనిపించేందుకు సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు నిపుణులైన వైద్యుల వద్ద ఈ చికిత్స తీసుకుంటే చర్మం తీరు అధ్యాయనం చేసి ఏ మేరకు ఫిల్లర్ నింపవచ్చో తెలుసుకుని చేస్తారు.సన్నగా ఉన్న పెదవులను లావుగా అయ్యేలా లిప్ ఫిల్లర్స్ వాడతారు.పెదవుల్లోకి హైల్డనాయక్ యాసిడ్ ను ఇంజెక్షన్ రూపంలో పంపడంవల్ల పెద్దగా అయిపోతాయి. తక్కువ ధరలో నాణ్యత లేని వాటిని ఉపయోగిస్తే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ వచ్చి పెదవుల రంగు మారిపోతుంది. పిల్లర్లు ఒకేసారి కాకుండా నిధానంగా రెండు మూడు విఅడతలుగా నింపాలి అతిగా నింపితే తగ్గించడం చాలా కష్టం. పెదవుల్లోకి కొలాజెణ్ నింపేటప్పుడు రక్తనాళాలు గమనించకపోతే ఇన్ ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది.

Leave a comment