మేకప్ సామాగ్రిని ఈ కరోనా సమయంలో వీలు దొరికినప్పుడల్లా శానిటైజ్ చేసి ఉపయోగించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మేకప్ బ్రష్ లను స్పాంజి లను షాంపూతో శుభ్రం చేసి ఆరిన తరువాత శానిటైజర్ చల్లి భద్రం చేయాలి.లిప్ స్టిక్ వేసుకోవటం పూర్తయిన ప్రతిసారీ పరిశుభ్రమైన వైప్స్ తో లిప్ స్టిక్ హోల్డర్ ను తుడవాలి.అలాగే లిప్ పెన్సిల్ ను కూడా వాడిని ప్రతిసారి శానిటైజర్ చేయాలి.అలాగే మస్కారా వాండ్ ను  శానిటైజ్ చేసేప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి పౌడర్లు చాలావరకూ సురక్షితమే కానీ పౌడర్ ఫౌండేషన్ లేదా బ్లషెన్  మీద ఆల్కహాల్ ఉన్న స్ప్రే ను  బాగా దగ్గర నుంచి స్ప్రే చేయకూడదు.పై పొరను తొలగించి దూరం నుంచి స్ప్రే చల్లి ఆరిన తర్వాత మూత పెట్టాలి.

Leave a comment