ధనుర్మాసారంభంతో కన్నె పిల్లలకు కాత్యాయని నోముతో,వాకిట్లో రంగవల్లి తీర్చిదిద్దటంతో, ఆవుపేడతో గొబ్బిళ్ళను అందంగా పసుపు-కుంకుమ,పూలతో అలంకరించటంతో హడావుడిగా ఉంటారు.
గొబ్బెమ్మ అంటే సంసృత పదం.దాని అర్థం గోపిక, గోదాదేవి అని.రంగవల్లి మధ్యలో పెద్ద (తల్లి)గొబ్బెమ్మను పెట్టి దాని చుట్టూతా పిల్ల గొబ్బెమ్మను పెట్టి కన్నె పిల్లలు తమని తాము గోపికలుగా భావించి గొబ్బియళ్ళో…గొబ్బియళ్ళో ..అని పాడుతూ ఆడుతారు.క్రమం తప్పకుండా కన్నెపిల్లలు ఈ నోము పాటిస్తే మంచి గుణసంపదలు కలిగిన భర్త వస్తాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి.
రంగవల్లులను గొబ్బిళ్ళతో, భోగి మంటలు,భోగి పళ్ళతో, బొమ్మల కొలువుతో, కొత్త అల్లుళ్ళతో,కొత్త ధాన్యంతో,హరిదాసుల నగర సంకీర్తనలు, కోడి పందాలతో ఐదు రోజుల తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,కొత్త బియ్యం పొంగలి, అరిసెలు,పులిహోర.
-తోలేటి వెంకట శిరీష