సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం అనే పేరు తో పిలిచారు పెద్దలు. ఈ నెల రోజులు నెల నిండగా తెల్లని ముగ్గులు శ్రీ హరిని కీర్తిస్తూ హరి దానుల దాకా, జంగమ దేవరల పలకరింపు కాలపు మార్పులను సూచిస్తూ వినోదాన్ని పంచే పిట్టల దోరలు బూడ బుక్కల పాటలు ఇవన్నీ సంక్రాంతి పర్వ దినాల్లో పల్లెటూరులో సందడి చేసేవి. కాలం మారి పోయి పట్టణాలకు తరలి వచ్చిన ఈ సంప్రదాయపు పండుగని జరుపుకుంటునే ఉన్నారు. చివరకు అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు కూడా ఈ పండుగని మరచిపోలేదు. అలాగే గోదాదేవి రచించిన ౩౦ పాశుణలనీ పాడుతూ ఈ నెల రోజులు పండుగ జరపడం ద్రవిడ దేశాల్లో ఆచారంగా వుంది.

Leave a comment