బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో రాయగడ్ జిల్లాలోని పద్మపురం సమీపంలో సేవ సమాజ్ ఆశ్రమాన్ని స్థాపించారు శాంతి దేవి.ఒడిస్సా లోని బాలేశ్వర్ లో 1934 లో జన్మించారు. శాంతి దేవి కుటుంబంలో అందరూ సమాజ సేవలోనే ఉండటం తో ఆమె కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నారు సామాజిక సేవ కార్యకర్త రతన్ దాస్ ను వివాహం చేసుకున్నారు కొరాపుట్ జిల్లా లోని సంకల్ పదార్ గ్రామంలో కుష్టు రోగులకు సపర్యలు చేస్తూ తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సేవ సమాజ్ లో ఇప్పుడు 350 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్,చత్తీస్ ఘడ్ వంటి చోట్ల తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న శాంతి దేవికి పద్మశ్రీ లభించింది.