అందరిలో ప్రత్యేకంగా వుండాలని ఆశించడం సబబే కానీ అందుకోసం మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? మార్కెట్ లో ఒక ట్రెండ్ ఫ్యాషన్ అయినంత మాత్రాన దీన్ని ఫాలో అయిపోమని రులేముంది. మన ఎత్తు రంగు ఆకృతికి సరిపోవాలి కదా? మార్కెట్ లో వున్న ట్రెండ్ కి సొంత అభిరుచి జోడించి, రంగూ డిజైన్ ల లో మార్పులు చేస్తే అప్పుడు కొత్త వొరవడి సృష్టించినట్లు. ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు కొనుక్కుంటే సరిపోదు. ఆ దుస్తులకు తగ్గ అలంకరణ వస్తువులు, నగలు వాటికి జోడించాలి. చివరికి మ్యాచ్ అయ్యే గోళ్ళ రంగు కూడా వదలకూడదు. అప్పుడే పరిపూర్ణత. అలాగే ఖరీదైనవి కొన్నాక వాటిని వన్నె తగ్గకుండా ఎక్కువ కాలం మన్నేలా చూసుకోవడం ఇంకో ఎత్తు. దుస్తుల పైన వున్న లేబుల్స్ శ్రద్దగా చదివి, అవి ఎలా ఉతకాలో, ఎలా ఇస్త్రీ చేయాలో తెలుసుకోవాలి. అలాగే కొంచం ఖరీదు ఎక్కువైన దుస్తుల పైకి సారి పడే స్కార్ఫులు దుపట్టాలు, వర్క్ చేసిన బ్లావుజులు సిద్ధం చేసుకుంటే గానీ అలంకరణ పర్ఫెక్ట్ గా వుండదు. అందరిలాగే షాపింగ్ చేస్తాం. కానీ మన ప్రత్యేకత ఉట్టిపడేలా వాటికి మాచింగ్స్ అన్ని తెచ్చుకోవాలి.
Categories