Categories
జార్ఖండ్ రాష్ట్రం లోని గిరిజన తెగలు సర్హుల్ ఉత్సవం నిర్వహిస్తారు.ఇప్పుడు మనం ఉపయోగించే కలప సాల్ వృక్షాల కలిపే.సాల్ వృక్షం తో భిన్న మతాల వారికి అనుబంధం ఉంది. పలు పురాణాలలో సాల్ వృక్ష ప్రస్తావన ఉంది. దాన్ని విష్ణుమూర్తికి ప్రియమైన చెట్లు గా చెపుతారు.జైన్ ల 24 వ తీర్ధకురునికి సాల్ వృక్షం నీడలో తపస్సు చేశాకనే జ్ఞానోదయం అయింది. గౌతమ బుద్ధుడు జన్మించినపుడు అతని తల్లి సాల్ వృక్షపు పిలకను చేత్తో పట్టుకొని ఉందని,గౌతముడి నిర్మాణం రెండు సాల్ వృక్షాల నీడలో జరిగిందని చెపుతారు. ప్రతి నెలా ఏప్రిల్ లో జార్ఖండ్ లో సర్హుల్ ఉత్సవం జరుపుకొంటారు. సాల్ మొక్కని పూజిస్తారు. ఈ వృక్షాల్లో దేవతలు విశ్రాంతి తీసుకొంటారని జార్ఖండ్ గిరిజనులు నాముతారు.