Categories
మురికిగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన బ్యాగ్ లు యాక్సెసరీస్ తయారు చేయించింది ఢిల్లీకి చెందిన కనిక ఆహుజా. కర్నాటక లో ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసిన కనిక ‘లిఫాఫ’ బ్రాండ్ ఐడియాతో, పేదలు, అనాధలకు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటం నేర్పించింది. ఈ హ్యాండ్ మేడ్ రీసైకిల్ ప్లాస్టిక్ పని తో వాళ్లు అద్భుతమైన బ్యాగ్ లు యాక్సెసరీస్ తయారుచేస్తే లాక్మే ఫ్యాషన్ వీక్ ఈ ఉత్పత్తులు ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చింది. దీనితో అమెరికా, యూరప్ లలో కూడా ఉత్పత్తులకు డిమాండ్ వచ్చింది. ప్లాస్టిక్ టు ఫ్యాబ్రిక్ లిఫాఫ ఐడియాల్లో ఒకటి. తన వ్యాపారానికి సామాజిక కోణం జోడించి అద్భుతమైన సామ్రాజ్యాన్ని సృష్టించింది కనిక అహుజా.