మునగ పేరు వినగానే రుచిగా ఉండే సాంబారు,చారు గుర్తుకొస్తాయి . కానీ మునగ పొడి సౌందర్యాన్నీవ్వటంలో ముందు ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మునగాకు పొడి చర్మం ముడతలను తగ్గిస్తుంది . యవ్వన కాంతిని తీసుకువస్తుంది . మునగాకు పొడిలో రోజ్ వాటర్ కలిపి నల్ల మచ్చలు యార్క్ ఉన్నా చోటరాసి ఆరిన తర్వాత శుభ్రపరిస్తే మచ్చలు ,మొటిమలు యార్క్ సమస్య తగ్గుతుంది .మునగాకు పొడిలో తేనే,రోజ్ వాటర్ కలిపి కాసిని నీళ్ళు కూడా కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి . ఈ మెత్తని పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు ఆరిపోనిచ్చి కడిగేస్తే చర్మం మృదువుగా ,కాంతివంతంగా అయిపోతుంది . కొబ్బరి పాలు ,మునగాకు పొడి ,తేనే మిశ్రమం శిరోజాలు రాలకుండా చేస్తుంది . కొబ్బరిపాలు కాస్త వెచ్చజేసి అందులో తేనే మునగాకుపొడి కలిపి జుట్టుకు అప్లైయ్ చేస్తే చాలు . పదినిముషాలు అలా వదిలేసి తలస్నానం చేస్తే చాలు జుట్టుకుదుళ్ళు బలంగా అవుతాయి .
Categories