గణితం పట్ల ఉన్న ఆసక్తి తోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివాను నిరంతరం పొదుపు మంత్రాన్ని జపం చేసే మన దేశ మైండ్ సెట్ తో పెరిగాను కనుక అదే ఆలోచనతో క్యాష్ కరో డాట్ కామ్ ప్రారంభించాను అంటుంది స్వాతి భార్గవ్. నా ఉద్దేశం లో ఎవరైనా సంతృప్తికరమైన జీవితం కోసం చక్కని ప్లాన్స్ వేసుకోవాలి. డబ్బు దుబారా చేయకూడదు అనుకున్న పనులు వెంటనే చేసేయాలి. వచ్చే ఆదాయంలో మొదటి నుంచి కొంత సొమ్ము ఆదా చేయాలి. తరువాత వాటిని తెలివిగా ఇన్ వెస్ట్ చేయాలి. తరువాత వాటిని తెలివిగా ఇన్ వెస్ట్ చేయాలి. మనం ప్రాధాన్యాలు అమలు చేస్తేనే జీవితం సంతోషంగా సాగుతుంది అంటుంది స్వాతి భార్గవ్ .