బయట అడుగు పెడితే చాలు కాలుష్యం దుమ్ము ధూళి తో ముఖం మురికిగా నిర్జీవంగా అయిపోతుంది. దీన్ని బియ్యం పిండి పూతతో తొలగించవచ్చు. బియ్యం పిండి, ఎర్ర పప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పిండికి ఓట్స్, ముల్తానీ మట్టి, పసుపు, వేప పొడి కలపాలి. కొన్ని చుక్కలు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల పెరుగు వేస్తే స్క్రబ్ తయారైనట్లే. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు, కాళ్ళు, పాదాలకు రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మార్పు తెలుస్తుంది. బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఖనిజాలు పప్పు ల్లోని మాంసకృత్తులు పెరుగు సమ్మేళనాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

Leave a comment