Categories
సీగ్రిడ్ ఇండ్సెట్ నార్వే రచయిత్రి. ఈమె 1882 లో డెన్మార్క్ నగరంలో జన్మించింది. సీగ్రిడ్ తండ్రి తన 11వ ఏట మరణించడంతో ఆ విషాదం ఆమె బాల్యంలోను, యవ్వనంలో ను బలమైన ముద్ర వేసింది.మధ్యయుగం లోని స్కాండినేవియా దేశపు జీవితాన్ని శక్తివంతంగా, కళ్ళకు కట్టినట్లు చిత్రించినందుకు, ఆ నేపధ్యపు నవలలు క్రిస్టిన్ లవ్రన్స్ డాట్ట్టెర్, ఓలవ్ ఔడున్ స్సోన్ వ్రాసినందుకు ఆమెకు 1928 లో నోబెల్బహుమతి ప్రదానం చేశారు. 1949లో పరమపదించిన సీగ్రిడ్ ఇండ్సెంట్ స్మృతి చిహ్నంగా నార్వే, స్వీడన్ రెండు దేశాలలోనూ ఆమె ముఖచిత్రంతో తపాలా బిళ్ళలు విడుదల చేశారు.