Categories
ఇంటి అలంకరణ మారుతూ ఉంటేనే ఆ కొత్తదనం మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది పువ్వులు మొక్కలు ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి. రోజులో ఎక్కువసార్లు చూసే ఎదురు గోడకు పూల మొక్కలు కుండీలు లేదా ఫ్లవర్ వేజ్ లు అలంకరించవచ్చు. గది అలంకరణ లో ఇంట్లో ఎప్పటినుంచో ఉండే పాతకాలపు వస్తువులు ఎంతో ప్రత్యేకత ఇస్తాయి.సోఫా బెడ్ కుషన్ కవర్లు మంచి బ్రైట్ కలర్స్ తీసుకోవాలి. చక్క ఫర్నీచర్ కు లేత కాంతివంతమైన రంగుల కాంబినేషన్స్ తో కుషన్ కవర్స్ వేస్తే చాలా బావుంటాయి.గది గోడలు తేలిక రంగులు ఉండే గాఢమైన రంగుల కుషన్ కవర్స్ చక్కగా ఉంటాయి.లేత రంగుల గోడలు మనసు వత్తిడిని తగ్గిస్తాయి.