సెలవులు ఇచ్చేసాక అంటే ఇంట్లో వానర సేన వున్నట్లే. వున్న సెలవుల్లో ఏ సమ్మర్ స్కూలో వెతికి రెండు నెలల పాటు ఏవో కొన్ని క్రియేటివ్ పనులను నేర్చుకుంటారులే అనుకుంటాం. కానీ పిల్లల సమయం సద్వినియోగ చేసే దిశగా కూడా ఆలోచనలు మళ్ళించ వచ్చు. సంగిఇతం మనస్సుని ఉత్తేజితం చేస్తుంది. మెదడుని చురుకుగా ఉంచుతుంది. గొంతులో రాగాలు పలకవనిపిస్తే. ఏదైనా ఇష్టమైన వాయిధ్వని నేర్పించవచ్చు. ఇది మెదడుకి శరీరానికి మధ్య సమయంలో పూర్తి చేసే కొర్టులో ఎంచుకోవచ్చు. అవన్నీ చదువుకి సంబందించినవి కాకపోయినా పర్వాలేదు. ఉదాహరణకు వాళ్ళకు మంచి మంచి స్వీట్లు, కేక్స్ తయారీ, లేదా మంచి ఆహారం పట్ల ఆసక్తి వుంటే కేక్స్ తయారీ, లేదా రకరకాల జామ్ లు, జెల్లీలు, ఇంకా ఇష్ట పడితే ఏదైనా సరే వందేయడం పట్ల శిక్షణ తిసుకోనిస్తే వాళ్ళకు ఫ్యుచర్ లో ఉపయోగ పడతాయి. రెండు నెలల సమయం సద్వినియోగం అవుతుంది. అలాగే ఎన్నో భాషలున్నాయి వాటి పై ద్రుష్టి పెట్టవచ్చు. కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల సామాజికంగా వాళ్ళ పరిధులు పెరిగినట్లే.
Categories