Categories
సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేయటం లైక్ లు చూసి మురిసి పోవటం ఇవ్వాల్టి యువతకు మామూలే.కానీ సెల్ఫీ కోసం ఎక్కువ సమయం సెల్ ఫోన్ పట్టుకోవటం వల్ల మణి కట్టులో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మణికట్టులో తీవ్ర నొప్పి జలదరించినట్లు ఉండటం ఈ సిండ్రొమ్ లక్షణాలు . ఇలాంటి కేసులు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఈ సెల్ఫీల కోసం ఎత్తైన ప్రదేశాలు ఎక్కటం ,పోజులు ఇస్తూ దూకటం వంటి స్టంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభావం ఎముకలపై పడుతోందని. వైద్యులు హెరిస్తున్నారు. ఈ మోజును తగ్గిచుకొంటే మంచిదని ఈ సెల్ఫీల వల్ల వచ్చే అనర్ధాలను దృష్టిలో ఉంచుకొమ్మని చెపుతున్నారు.