Categories
తమిళనాడు కు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి పద్మ సుబ్రహ్మణ్యం సెంగోల్ రాజదండం గురించి ప్రధాని మోదీకి లేఖ రాయడం వల్లనే ధర్మానికి న్యాయానికి చిహ్నమైన ఆ సెంగోల్ ని కనుక్కోగలిగారు బ్రిటిష్ వారి నుంచి అధికారం బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఈ రాజదండాన్ని 1947 ఆగస్టు 14న నెహ్రూ అందుకున్నారు. దాన్ని ఆయన అలహాబాద్ మ్యూజియాలకు చేర్చారు. రెండేళ్ల క్రితం ఈ రాజ దండం గురించిన వార్త చదివిన పద్మ సుబ్రహ్మణ్యం దీన్ని ఎక్కడుందో కనిపెట్టామని ప్రధాని మోదీకి ఉత్తరం రాయడం తో సెంగోల్ కి పూర్వ వైభవం వచ్చింది. తిరిగి ప్రధాని చేతికి చేరుకుంది.