నీహారికా,
సాటివాళ్ళకు ఎంతో కొంత సేవ చెయ్యడం ముఖ్యమైన బాధ్యతేనంటావా అన్నావు. కొంతమంది అందరు ఎంతో కొంత చేయాలి. అందాల సామంత నీకు ఇష్టం అన్నావు కదా. ఆమె తమ సంపాదనలో ఎంతో కొంత సోషల్ సర్విస్ కోసం కేటాయిస్తుంది. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించి కాన్సర్ బారిన పడ్డ పిల్లలకు ఆసరా లేని మహిళలకు ఆశ్రయం కల్పిస్తుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో ధరించిన బట్టలు వేలం వేస్తె వచ్చిన డబ్బును ఈ ప్రత్యూష ఫౌండేషన్ కే ఇచ్చారు. సల్మాన్ ఖాన్, బీయంగ్ హ్యూమన్ ఫౌండేషన్ స్థాపించాడు. కాన్సర్ రోగులకు ఆర్ధిక సయం చేస్తారు. ఇక ఎప్పుడు అందర్నీ నవ్వించే అలీకి అతని తండ్రి పేరిట మొహమ్మద్ భాషా చారిటబుల్ ట్రస్ట్ వుంది. అంగ వైకల్యం వున్న పిల్లలకు మూడు చక్రాల సైకిళ్ళు, అందులకు చేతి కర్రలు ఇస్తారు. ఇక తెలుగు తమిళ ప్రేక్షకులకు సూపరీచితుడైన హీరో సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా చదువుకునే స్థోమత లేని గ్రామ విద్యార్ధులకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఇవన్నీ సెలబ్రెటీలకు పేర్లు తెస్తాయి కదా అని కేవలం ఉదాహరణలే. ఎంతో మంది కోసం సయం చేస్తారు. ప్రచారం అక్కరలేని ప్రేమ కొందరిది. ఇలా అందరు ఎదో రాకమియన్ సేవా చేసి సమాజపు రుణం తీర్చుకోవాలి కదా.