Categories
ఈ చలి రోజుల కోసం మార్కెట్ లోకి ఉలెన్ ఫ్యాబ్రిక్ స్వెట్టర్లు వచ్చాయి . కాటన్ సిల్క్,లెనిన్ తోపాటు నైలాన్ రేయాన్ దారాల స్వెట్టర్లు వచ్చాయి కానీ అన్నింటిలోనూ ఉలెన్ స్వెట్టర్లు చాలా ప్రత్యేకం . ఈ ఉలెన్ కలెక్షన్ లలో కుర్తీ,షార్ట్ టాప్స్ ,క్రాస్ టాప్స్ ,టీషర్టు ,చొక్కా ,లాంగ్ గౌన్ ,అనార్కలి ,మీడియం లెన్త్ ఫ్రాక్ అన్ని మోడల్స్ వచ్చాయి . ఆఫ్ షోల్డర్స్ ,రోల్డ్ షోల్డర్స్ ,సింగిల్ స్లీవ్ మోడల్స్ తో ఈ చలికాలం స్వెట్టర్ కాస్త ట్రెండీ ఉలెన్ డ్రస్ గా మారిపోయింది . ఇవి నేరుగా ఆఫీస్ లకు ,కాలేజీలకు వేసుకొని వెళ్లిపోవచ్చు .