Categories
ఈ వేసవికి తక్షణ శక్తిని అందించే సహజమైన డ్రింక్స్ ఎంతో అవసరం. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేడ్స్ అందించాలి. అలా పుచ్చకాయ క్యారెట్ల లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కొత్తిమీర లో సోడియం పైనాపిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే విటమిన్-బి కూడా ఉండటం వల్ల రిఫ్రెష్ మెంట్ కు పనికి వస్తుంది. ఈ నాలుగో కలిపి చేసే డ్రింక్ పవర్ బూస్టర్ అంటారు. పావు కప్పు పైనాపిల్ ముక్కలు పావు కప్పు పుచ్చ కాయ ముక్కలు రెండు క్యారెట్లు కొన్ని రెమ్మల కొత్తిమీర తీసుకోండి జ్యూసర్ లో గ్రైండ్ చేసుకోవాలి వడగట్టి ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే శక్తి నిచ్చే డ్రింక్ సిద్ధంగా ఉంటుంది.