Categories
జీవితం పొడవునా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటం ఏమంత కష్టం కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజుకో గంట ధ్యానం లేదా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మౌనం శక్తి యుక్తులను పెంచి ప్రశాంతత ఇస్తుంది. ఓ వెయింగ్ మిషన్ కొనుక్కోండి. వయసు ఎత్తు లను బట్టి ఎంత బరువు ఉంటే ఆరోగ్యమో వారానికి ఒకరోజు చేసుకోవాలి. అలాగే కోపాలు, ఆక్రోశాలు మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలాగే డైటింగ్ పేరుతో తిండి మానేస్తే లావు తగ్గడంతోపాటు ఆరోగ్యము చురుకుదనము పోతాయి. కనుక ఎంత తినాలి, ఏం తినాలో డైటీషియన్ సలహా పాటించాలి.