Categories
శిరోజాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత దృఢంగా ఉంటాయి. రాలిపోవు ఇతర సమస్యలు రావు.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.రెగ్యులర్ గా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడకూడదు.కుదుళ్ళకు హాని జరుగుతుంది.అదనపు రసాయన హాని జరగకుండా ఉండేందుకు రెసిస్టెన్స్ అడ్డుకునేందుకు బ్రాండ్లు మార్చాలి.జుట్టు తడిగా ఉన్నప్పుడు అదనపు జాగ్రత్తలు అవసరం.తడి జుట్టు దువ్వకూడదు దీంతో మరిన్ని చిక్కులు వస్తాయి. ఒకేసారి కలరింగ్,స్ట్రెయట్ నింగ్ వంటి బహుళ చికిత్సలు తీసుకోకూడదు.రాత్రంతా హెడ్ రోలర్స్ అలాగే ఉంచకూడదు.హెయిఅర్ స్టైలింగ్ జెల్స్ స్ట్రయిటనింగ్ జల్స్ ప్రతిసారి వాడకూడదు.కఠినమైన చలి మంచు ప్రభావల నుంచి జుట్టును కాపాడుకునేందుకు నాణ్యమైన కండీషన్ వాడాలి.కొబ్బరి పాలు సహజసిద్దమైన కండీషనర్.