నీహారికా,

పిల్లల మాటలు,చేష్టలు ఎప్పుడూముద్దొస్తాయి.ఒక్కసారి వాళ్ళ అమాయికమైన ప్రశ్నలు కూడా చాలా ఇబ్బందిలో పడేస్తాయి. టీవి లో ఏ సానిటరీ నాప్ కిన్ యాడో, ఏ కుటుంబ నియంత్రణ యాడ్ గానీ వస్తుంటే, నలుగురి ముందు అదేమిటి అంటారు. ఇంటికి ఎవరన్నాచుట్టాలోస్తే, ఆవిడెందుకు ఇంత లావుగా ఉంది అంటారు? లేదా నేనెలా పుట్టాను, ఎక్కడ నుంచి వచ్చాను? తమ్ముడు నీ పొట్ట లో ఎల్లా వచ్చాడు లాంటి భయంకరమైన ప్రశ్నలు అడిగి ఇరుకున పెడతారు సాధారణంగా నోర్ముసుకో అంటాం, ఇంకేం చేయాలో తోచక మన దగ్గర సమాధానం కూడా వుండదు నిజానికి. కానీ ఇలా విసుక్కుంటాం, లేదా అబద్దాలు ఆడటం తప్పవంటున్నరు. ఎక్స్ పర్ట్స్ వాళ్ళతో ఓర్పుగా మాట్లాడి ఇతరుల శరీరం గురించి మాట్లాడే మాటలు ఎందుకు తప్పో. వాళ్ళు ఎలా బాధ పడతారు చెప్పాలి. అలాగే కొన్ని టెక్నికల్ గా వివరించాలి. మరీ అర్ధం చేసుకోలేని ఏసి వాళ్ళయితే నువ్వు పెద్దయ్యాక ఇవన్నీ తెలుస్తాయి. ఇందుకుగానూ నువ్వు బాగా చదువుకోవాలి అని ప్రోత్సహించాలి. లోతుగా విశ్లేషణలు అక్కర లేదు జవాబులు క్లుప్తంగా విజ్ఞానాన్ని అందించేదిగా వుండాలి కానీ మరీ కుతూహలం పెంచి తప్పుదోవ పట్టించేదిగా ఉండకూడదు. అంతే కానీ తిట్టి, కోప్పడి, దట వేస్తె ఆ సందేహం తిరక్ పొగా ఇక దాని గురించే వాళ్ళు ఆలోచిస్తూ కూర్చునే ప్రమాదం వుంటుంది. పిల్లలతో జాగ్రత్తగా వుండాలి.

Leave a comment